రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఈ నెల 6వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని మున్సిపల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. పిల్లలకు వేసవి సెలవులు ప్రకటించినట్టుగానే టీచర్లలకూ ఇవ్వాలన్నారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ మే నెలలో పాఠశాలలు నడపలేదని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భావించి ఏప్రిల్ 24న చివరి పని దినంగా ప్రకటించేవారని గుర్తుచేశారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన తరువాత జూన్ 12 న తిరిగి పాఠశాలలు ప్రారంభం అయ్యేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే 5 రోజులలో 46 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయని కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసిందని వివరించారు.
ఇదీ చదవండి: 1000 రోజుల్లో 800 మంది మహిళలపై అత్యాచారం: లోకేశ్