ఇదీ చదవండి:
'వైకాపా నేతలు కనురెప్పల్ని సైతం మాయచేయగలరు' - mukhyamantri e-eye news
కనురెప్పల్ని సైతం మాయ చేయగల వైకాపా నేతలు... 'కంటి వెలుగు' పథకం అంటే ఏదో కొత్త పథకం అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారంటూ... తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వ హయాం నుంచి అమలు చేస్తున్న పథకమేనని ఆయన గుర్తు చేశారు. 11 లక్షల మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించామని వివరించారు. 222 ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. 67 లక్షల మందికి కంటి చికిత్స అందించి... 3 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు ఇచ్చామన్నారు. ఆ పథకానికే పేరు మార్చిన వైకాపా ప్రభుత్వం... ప్రజలను మాయ చేస్తోందని దుయ్యబట్టారు.
చంద్రబాబు ట్వీట్లు