ETV Bharat / city

'వ్యాక్సిన్ నిల్వ మౌలిక సదుపాయాలకు సాయం అందించండి' - ఎంపీ విజయసాయిరెడ్డి లెటెస్ట్ న్యూస్

బీపీఎల్​ కుటుంబాలకు ఉచితంగా కొవిడ్​ వ్యాక్సిన్ అందించాలని ప్రధాని మోదీని వైకాపా కోరింది. కొవిడ్ నివారణ, వాక్సిన్ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీలో కరోనా నిర్ధరణ పరీక్షలు అత్యధికంగా నిర్వహించామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వ్యాక్సిన్ల నిల్వకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సాయంచేయాలని కోరారు.

vijaysaireddy
vijaysaireddy
author img

By

Published : Dec 4, 2020, 7:37 PM IST

బీపీఎల్​ కుటుంబాలకు ఉచితంగా కరోనా వాక్సిన్ ఇవ్వాలని ప్రధాని మోదీని వైకాపా విజ్ఞప్తి చేసింది. వాక్సిన్లను నిల్వ చేసేందుకు కావాల్సిన మౌలిక వసతులకు కేంద్రం సాయం చేయాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. వివిధ రాజకీయ పక్షాలతో కొవిడ్ నివారణ, వాక్సిన్ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు.

ఏపీలో అత్యధికంగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ 20 శాతం జనాభాకి పరీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం 6 వేల యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. 0.81 శాతం మాత్రమే మరణాల రేటు ఉందన్నారు. కేసుల సంఖ్యలో దేశంలో మూడో స్థానంలో ఉన్నా రికవరీ రేటు 98.42 శాతం ఉందని ప్రధానికి వివరించారు. దీనికి సీఎం కృషితో పాటు ప్రధాని సహకారం కూడా ఉందన్నారు. వాక్సిన్ తయారీలో ప్రధాని చూపుతున్న కృషి అభినందనీయమన్న విజయసాయిరెడ్డి....తొలుత ఫ్రాంట్ లైన్ వారియర్స్​కి వాక్సిన్ ఇవ్వాలని ప్రధాని తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.

ఆరోగ్య శ్రీ ద్వారా కొవిడ్​కి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. 150 సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల్లో రీయంబర్స్ చేస్తున్నామన్నారు. కొవిడ్ నివారణకు అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామని...రోజుకు రూ.10.18 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో 4.57 కోట్ల రూపాయలు కేవలం టెస్టులకు ఖర్చు చేస్తున్నామన్నారు. కరోనా నివారణకు కేంద్రం సాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి : పంచాయతీ ఎన్నికల పిటిషన్​పై ముగిసిన వాదనలు...తీర్పు రిజర్వు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.