కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోయే తరుణంలో దానిని రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కంపెనీ ఏయే ప్రయోజనాలు కావాలంటుందో... అన్నింటినీ ఏపీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. సంస్థ తరలిపోతుందనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సర్కారు కల్పిస్తోందని చెప్పారు.
అవన్నీ గాలి వార్తలు: ఎంపీ గోరంట్లమాధవ్
కియా తరలింపుపై వస్తున్నవన్నీ గాలి వార్తలేనని అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కియా పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదని ఎంపీ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: