"రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికే జీవో అన్న అభిప్రాయం ఉంది. హిందూ ధర్మం ఆచరించే పలువురి నమ్మకాలను గాయపరుస్తోంది. ఇద్దరు సభ్యులతో అథారిటీ ఏర్పాటుచేస్తే నిర్ణయాలపై చర్చకు వీలుండదు. ట్రస్టు బోర్డు అధికారాలను అథారిటీకి బదిలీ చేసినట్లు అర్థమవుతోంది. కొత్త స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుపై ఎవరికీ నమ్మకం కలగట్లేదు. దేవుడి సొమ్ము దారి తప్పిస్తారేమోనని కూడా ఆందోళన చెందుతున్నారు. అథారిటీకి ఆర్థిక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని తీసేయాలి. కొత్త బోర్డు ఏర్పడ్డాకే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాలి. కాలయాపన చేయకుండా నూతన బోర్డు ఏర్పాటు చేయాలి." - రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ
ఇదీ చదవండి:
Water dispute: 'రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకోనున్నాం..'