దేవాలయాల పరిరక్షణకు ఈనెల 11న దీక్ష: రఘురామకృష్ణరాజు - రఘురామకృష్ణరాజు దిల్లీలో దీక్ష వార్తలు
ఏపీలోని దేవాలయాలపై దాడులకు నిరసనగా ఎంపీ రఘరామకృష్ణరాజు ఈనెల 11న దీక్షను చేపట్టనున్నారు. దిల్లీలోని ఆయన నివాసంలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తానని ఆయన వెల్లడించారు.

mp raghu ramakrishna raju
రాష్ట్రంలోని దేవాలయాల పరిరక్షణకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఒక్కరోజు దీక్షకు సిద్ధమయ్యారు. దిల్లీలోని అధికార నివాసంలో ఈ నెల 11న ఆయన దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ దిల్లీలోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 11న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తాను. ఆలయాలపై దాడులు జరగకుండా కఠిన తీసుకోవాలి. ఈ తరహా దాడులపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలి -రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ