సీఎం జగన్కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. శాసనమండలిని రద్దు చేయాలని కోరారు. శాసనమండలిలో వైకాపాకు మెజార్టీ పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మండలిని రద్దు చేస్తే మీపై గౌరవం పెరుగుతుందని లేఖలో ప్రస్తావించారు.
-
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి లేఖ రాయడం జరిగింది. మండలి కొనసాగించడం వృధా అవుతుందని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను ప్రజలు నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలి. @AndhraPradeshCM pic.twitter.com/wvTRuxpaMs
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి లేఖ రాయడం జరిగింది. మండలి కొనసాగించడం వృధా అవుతుందని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను ప్రజలు నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలి. @AndhraPradeshCM pic.twitter.com/wvTRuxpaMs
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 21, 2021ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి లేఖ రాయడం జరిగింది. మండలి కొనసాగించడం వృధా అవుతుందని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను ప్రజలు నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలి. @AndhraPradeshCM pic.twitter.com/wvTRuxpaMs
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 21, 2021
సీఎం జగన్ గారికి లేఖ రాశాను. అందులో శాసనమండలిని రద్దు చేయాలని కోరాను. మండలి రద్దుపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిత్యం స్పందిస్తున్నారు. తాజాగా మండలి రద్దుపై వెనక్కి తగ్గేది లేదని నలుగురు నూతన శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగానూ చెప్పారు. అందుకు సీఎం జగన్ తో పాటు.. ఆయన వాణి వినిపించిన సజ్జలకు నా శుభాభినందనలు. వారి ఆశయ సాధనకై మండలి రద్దుకోసం పని చేస్తాను - ఎంపీ రఘురామకృష్ణరాజు
ఇదీ చదవండి