వైకాపా నేతలు ఎన్నోసార్లు ఎన్డీఏ(NDA)లో చేరతామని బ్రతిమలాడితే.. భాజపా నేతలు(BJP leaders) అంగీకరించలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు(MP raghuramakrishnaraju) అన్నారు. ఇప్పుడు కేంద్రమంత్రి అఠవాలే ఎన్డీఏలో చేరాలని అనడం హాస్యాస్పదంగా ఉన్నాయని ఎంపీ రఘురామ అన్నారు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక జోక్ వేస్తూనే ఉంటారంటూ కొట్టిపారేశారు. ఒకవేళ ఆయన పార్టీలో వైకాపాను కలుపుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమో అంటూ ఎద్దేవా చేశారు.
జగన్‌పై పోటీ చేస్తా...
కేసీఆర్(KCR) మాదిరిగా అధ్యక్ష పదవికి వైకాపాలో ఎన్నికలు నిర్వహిస్తే తప్పకుండా జగన్‌పై పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని ఆయన అన్నారు. పార్టీలో 125 మంది సంతకాలతో ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేసి పోటీలో నిలబడతానన్నారు.
గతంలో ఎన్నోసార్లు ఎన్డీఏలో చేరేందుకు వైకాపా ప్రయత్నించింది. భాజపా నేతలు వైకాపాను వద్దని చెప్పేశారు. ఈ క్రమంలో ఎన్డీఏలోకి రావాలని కేంద్రమంత్రి అఠవాలే ప్రయత్నించడం హాస్యాస్పదం. వైకాపా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేస్తాను. జగన్‌పై పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. పార్టీలో 125 మందితో సంతకాలు చేయిస్తాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. - రఘురామకృష్ణరాజు, ఎంపీ
ఇదీచదవండి.