ETV Bharat / city

MODI BIRTHDAY: దేశ సంస్కృతిని కాపాడే పార్టీ భాజపానే: సోము వీర్రాజు

దేశ సంస్కృతిని కాపాడే పార్టీ భాజపా మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రధాని మోదీ జన్మదిన వేడుకలతో పాటు.. విశ్వకర్మ వేడుకలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు.

modi birthday celebrations in party office

author img

By

Published : Sep 17, 2021, 9:42 PM IST

దేశ సంస్కృతి, ఔన్నత్యం, సంప్రదాయం, నిర్మాణ కౌశలాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ 71వ జన్మదినోత్సవం, విశ్వకర్మ మహెూత్సవాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సూక్ష్మ వస్తువులను తయారుచేసే కళాకారులను సన్మానించి నమో విశ్వకర్మ ఆర్టిజన్ అవార్డులు అందజేశారు.

విశ్వకర్మ జయంతిని ఒక్క భాజపానే నిర్వహిస్తోందని వీర్రాజు అన్నారు. మోదీ జన్మదినం కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుపుతామన్నారు. గొలగాని ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్శహించిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వీర్రాజు పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ వారి పాదాలు కడిగారు.

ఇదీ చదవండి: CM JAGAN TWEET: ప్రధాని మోదీకి సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.