వైకాపా నేత సజ్జల రామకృష్ణరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. సహజ వాయువుపై పెంచిన పన్ను భారం ఎవరి మీద పడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 10 శాతం పెంచిన వ్యాట్‌ను ఇడుపులపాయ నేలమాళిగల నుంచి తీసి కడతారా అని ప్రశ్నించారు. పెంచిన వ్యాట్ వల్ల వంట గ్యాస్ వినియోగదారులపై భారం పడదా అని నిలదీశారు. కొన్ని జిల్లాల్లో పైప్డ్ గ్యాస్‌ని వంట గ్యాస్‌గా వినియోగిస్తున్న సంగతి సజ్జలకు తెలీదా అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం పెంచిన భారం ప్రజలపై పడదంటున్నారు మరి, ఎవరి మీద పడుతుందో చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు.
లోకేశ్‌పై సజ్జల అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ గురించి మాట్లాడే ముందు జగన్ మాట్లాడిన కొన్ని వీడియోలను చూడాలని ఎద్దేవా చేశారు. ముందుగా జగన్‌కు అ, ఆ లు నేర్పాలని సూచించారు. దమ్ముంటే సీఎం జగన్‌తో మీడియా సమావేశం నిర్వహించాలని సవాల్ విసిరారు.