ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాలు మాత్రమే ఇవ్వటాన్ని నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు తన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం 5గం.ల వరకు నిరసన దీక్ష చేపట్టారు. మార్చిలో అధిక ఆదాయం వచ్చినప్పుడే సగం జీతాలు ఇస్తే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. రాజకీయలబ్ధిలో భాగంగానే తెలంగాణను చూసి జీతాల్లో కోత పెట్టారని ఆరోపించారు. ఈ తీరు సరికాదని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనో లేక కేసీఆరో అర్థం కావట్లేదని విమర్శించారు.
డబ్బులు ఉన్నా.. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ముందుగా చెల్లించటాన్ని తప్పుబట్టారు. వైకాపాకు అనుకూలమైన ఒకరిద్దర్ని పిలిపించుకుంటూ.. ఉద్యోగ సంఘాలతో మాట్లాడానని సీఎం చెప్పడం సబబు కాదని వ్యాఖ్యానించారు. భయపెట్టడం, బెదిరించే ధోరణులతో కింది స్థాయి ఉద్యోగులెవరూ నోరు మెదపటం లేదన్నారు. మార్చి నెలలో ఎంత ఖర్చు చేశారో చెబుతూ.. ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: