జూలై 15 నాటికి 50 వేల గృహాలు పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో వరద ప్రభావిత గ్రామాల నిర్వాసితులకు అందుబాటులోకి తీసుకువస్తామని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను ఉప ముఖ్య మంత్రి ఆళ్ల నాని, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.
జీలుగుమిల్లి మండలం రౌతు గూడెం లో రెవెన్యూ గృహ నిర్మాణ సంస్థ ఆర్ అండ్ ఆర్ అధికారులతో మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ 30 వేల కోట్లకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు కేవలం 15 శాతం మాత్రమే జరిగాయి అన్నారు. లక్షా 10 వేల కుటుంబాలకు సంబంధించి గత ఐదేళ్లలో ఒక ఇల్లు కూడా నిర్మించని తేదేపా మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మంత్రి అనిల్ మండిపడ్డారు. మొదటి దశలో 17వేల కుటుంబాలను ఎట్టి పరిస్థితుల్లో జూలై 15 నాటికి కాలనీలకు తరలిస్తామని అన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో కాలనీలు నిర్మాణాలు పూర్తి చేసి నిర్వాసితులు అందరిని పూర్తిస్థాయిలో తరలిస్తామని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణాలు నాణ్యతతో చేపట్టేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు పునాది దివంగత రాజశేఖర్ రెడ్డి వేస్తే ప్రారంభించే అదృష్టం ముఖ్యమంత్రి జగన్ కి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు
ఇదీ చదవండి: