ETV Bharat / city

ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే మనం చేయాలా?: మంత్రి సురేశ్ - AP News

పరిస్థితులు చక్కబడ్డాకే ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలను కూడా ప్రతిపక్షం రాజకీయాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే మనం చేయాలా..? అని ప్రశ్నించారు.

మంత్రి సురేశ్
మంత్రి సురేశ్
author img

By

Published : Jun 8, 2021, 3:46 PM IST

మంత్రి సురేశ్

విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నామని, పరిస్థితి చక్కబడ్డాక నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 'జగనన్న తోడు' కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరీక్షలు రద్దుచేయమని డిమాండ్‌ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతీ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు, లోకేశ్ అనుకుంటారని వ్యాఖ్యానించారు. పరీక్షలు రాసి, ధ్రువపత్రాలు ఇస్తే అది విలువంటుందని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే మనం చేయాలా..? అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా..? అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ... పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.