ETV Bharat / city

Perni Nani Tribute to Sirivennela: సిరివెన్నెల భౌతికకాయానికి మంత్రి పేర్ని నాని నివాళులు

గొప్పకవిగా సిరివెన్నెల సీతారామశాస్త్రి అక్షర విన్యాసం చేశారని మంత్రి పేర్నినాని అన్నారు. సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

author img

By

Published : Dec 1, 2021, 11:58 AM IST

minister-perni-nani-tribute-to-sirivennela-dead-body
సిరివెన్నెల భౌతికకాయానికి మంత్రి పేర్ని నాని నివాళులు

హైదరాబాద్​లో సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. తెలుగుజాతి గర్వపడేలా గేయాలు రాసిన వ్యక్తి సిరివెన్నెల అని మంత్రి కొనియాడారు. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

తన పద విన్యాసంతో.. కేవలం సినిమా పరిశ్రమ మీదనే కాకుండా తెలుగు తెలిసిన, తెలుగు నేర్చిన ప్రతీ తెలుగువాడి మదిలో తనకంటూ ఒక ముద్రను ముద్రించుకొని వెళ్లినటువంటి మహనీయులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు. సినిమా కోసం కాకుండా తెలుగుజాతి గర్వపడేలా తన కళాన్ని కదిలించినటువంటి గీత రచయిత, పద రచయిత, సాహితీకారుడు... ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలియజెప్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తరఫున, జగన్మోహన్​ రెడ్డి గారి తరఫున ప్రార్థిస్తున్నాను - పేర్ని నాని, మంత్రి

ఇదీ చూడండి: Sirivennela: మసకేసిన వెన్నెల గీతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.