ETV Bharat / city

ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు అండగా ఉంటాం: పెద్దిరెడ్డి - EGS works in AP

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. కరోనాతో చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కొవిడ్​ బారినపడి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగికి నెల జీతం అడ్వాన్స్​గా చెల్లిస్తామన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
author img

By

Published : May 20, 2021, 10:31 PM IST

ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు కరోనాతో చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగికి నెల జీతం అడ్వాన్స్​గా చెల్లిస్తామన్నారు. నాలుగు జిల్లాల ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో మంత్రి పెద్దిరెడ్డి వెబ్​ఎక్స్ సమావేశం నిర్వహించారు.

కిందటి సంవత్సరం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో అంతకుమించి ఫలితాలు సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి ఉపాధి హామి సిబ్బందికి సూచించారు. కూలీలకు ఎక్కువ పనిదినాలను కల్పిస్తే దాని ద్వారా మెటీరీయల్ వాటా ఎక్కువ సాధించగలుగుతామని వివరించారు. వాటితో గ్రామీణ మౌలిక సదుపాయాలు నిర్మించుకోవచ్చని అన్నారు. జూన్ నెలాఖరుకు 16 కోట్ల పని దినాలను పూర్తి చేస్తే, కేంద్రాన్ని అదనంగా ఆడగవచ్చని వ్యాఖ్యానించారు.

గత సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించడానికి కారణమైన అందరికీ అభినందనలు మంత్రి తెలిపారు. రోడ్డుకిరువైపులా మొక్కల పెంపకం, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడం, బ్లాక్ ప్లాంటేషన్ వంటి పనులను చేపట్టాలని ఆదేశించారు. జలశక్తి అభియాన్ పనులను వర్షాకాలంలోపు పూర్తి చేయాలని నిర్దేశించారు. వైఎస్ఆర్ జలకళలో 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి పేదరైతుకి ఉచితంగా బోరు వేయించేలా పీడీలు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు.

ఇదీ చదవండీ... రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.