ఇదీ చదవండి:
'న్యాయశాఖలో ప్రాంతీయ భాష ఉండాలని అభిలషించిన వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ' - justice nv ramana sworn in as the CJI
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని తెలుగు బిడ్డ అధిరోంహించినందుకు యావత్తు తెలుగు జాతి గర్విస్తుందని శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. న్యాయపాలనలో ప్రాంతీయ భాషలు ఉండాలని గట్టిగా అభిలషించిన వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ అని అన్నారు. 2013వ సంవత్సరంలో 50కి పైగా తీర్పులు తెలుగులోనే రావడం వెనుక జస్టిస్ రమణ స్పూర్తి ఉందని, ఇటీవల సుప్రీం కోర్టు తన తీర్పులను వివిధ ప్రాంతీయ భాషలోకి తార్జుమా చేసి అధికారక వెబ్ సైట్లలో ఉంచాలనే నిర్ణయం వెనుక జస్టిస్ రమణ ఉన్నారని చెప్పారు. కన్నతల్లి, మాతృ భాష, సొంత దేశంపై మమకారం ఉన్నావారు ఏ పదవి చేపట్టినా.. తమ ప్రత్యేకతను చాటుకుంటారనడానికి జస్టిస్ ఎన్.వి.రమణే ఉదాహరణ అని ఈటీవి భారత్తో ముఖాముఖిలో అభిప్రాయపడ్డారు.
justice nv ramana
ఇదీ చదవండి: