అమరావతిలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మందడం రహదారిపై గ్రామస్థులు అడ్డంగా టెంట్ వేశారు. ఈ కారణంగా.. సచివాలయానికి రాకపోకలు నిలిచాయి. మందడం-మల్కాపురం జంక్షన్ వద్ద.... పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని... తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకుని.... గుర్తింపు కార్డులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. తాము శాంతియుత నిరసన తెలుపుతున్నామని.... ఆందోళనకారులు పోలీసులకు చెప్పారు. అడ్డుకోవద్దని కోరారు.
ఇవీ చదవండి: