ETV Bharat / city

చిన్నారుల అశ్లీల వీడియోలు... రంగంలోకి కేంద్ర హోంశాఖ... హైదరాబాద్​లో అరెస్టు - చిన్నారుల అశ్లీల వీడియోలు

సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు పోస్టు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్​లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మధుకర్​రెడ్డి.. సోషల్​మీడియాలో అశ్లీల వీడియోల లింకులు పంపి డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా భద్రత విభాగం పోలీసులు... మధుకర్​రెడ్డిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

porn
porn
author img

By

Published : Oct 8, 2021, 7:01 AM IST

సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల వీడియోలు పోస్టు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్​లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మధుకర్​రెడ్డి.. సోషల్​మీడియాలో అశ్లీల వీడియోల లింకులు పంపి డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా భద్రత విభాగం పోలీసులు... మధుకర్​రెడ్డిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మధుకర్​రెడ్డిని గాలించగా.. కరీంనగర్​లో పోలీసులకు పట్టుబడ్డాడు. మధుకర్​రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

రంగంలోకి కేంద్ర హోంశాఖ..

చిన్నపిల్లలతో అసహజంగా చిత్రీకరించిన నీలిచిత్రాలు చూస్తున్న వారిని, వాటిని పంపే వారిని నేరుగా జైలుకే పంపిస్తున్నారు. ఎక్కడున్నా సరే వారిని పోలీసులు వెంటాడి, వేటాడి మరీ పట్టుకుని కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. నాలుగైదేళ్లుగా మైనర్లతో చిత్రీకరించిన నీలిచిత్రాల వెబ్‌సైట్లను వీక్షించే వారి సంఖ్య పెరుగుతుండడం, వీటి ప్రభావంతో చిన్నారులు, మైనర్లపై అకృత్యాలు పెరుగుతుండడంతో కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా నీలిచిత్రాలు చూస్తున్న వారిని గుర్తించి వారి చరవాణులు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ఐపీ చిరునామాల ఆధారంగా నిందితులను గుర్తించి నివేదికను ఆయా రాష్ట్రాలకు పంపుతోంది.

హైదరాబాద్​లో ఇలాంటి కేసులు..

చిన్నారులపై చిత్రీకరించిన నీలిచిత్రాల వీక్షణాన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. తొలిసారి దొరికిన వారికి ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల వరకూ జరిమానా విధిస్తున్నాయి. రెండోసారి కూడా నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేస్తే... ఏడేళ్లపాటు జైలులోనే ఉండాలి. దీంతోపాటు రూ.10లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో రెండేళ్ల క్రితం 16 కేసులు నమోదు కాగా, ఇందులో ముగ్గురిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతేడాది కూడా 20 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు నిందితులపై రెండోసారి కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.