రాష్ట్రంలో రవాణా రంగం ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో హరిత పన్ను మరింత భారం అవుతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో మందగమనం వల్ల ఫైనాన్సులు కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని.. ఈ సమయంలో తమపై పన్నులు బాదడం పూర్తిగా కుంగదీయడమేనని వాపోతున్నారు. హరిత పన్ను వల్ల రవాణా రంగాన్ని మరింత నష్టాల ఊబిలోకి నెట్టేయడమే అవుతోందంటున్న లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: TIRUMALA: తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్ మూసివేత