ప్రభాస్ అభిమానుల్లాగానే తాను ‘సాహో’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. ప్రభాస్ కథానాయకుడిగా వస్తోన్న సాహో ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్భంలో ప్రభాస్ ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గురించి విలేకరి ప్రశ్నించారు. ప్రభాస్ స్పందిస్తూ.. తనకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదని, జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. ప్రభాస్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేతలు ఆగ్రహానికి గురై సాహోకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఓ వెబ్సైట్ కథనం రాసింది. ఈ కథనంపై లోకేశ్ ట్విటర్లో స్పందించారు.
ఇంతగా దిగజారి వార్తలు రాయడం సరికాదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్వేషపూరితమైన ప్రచారం వల్ల వచ్చిన డబ్బులతో ఎలా భోజనం చేయగలుగుతున్నారని ప్రశ్నించారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానన్న లోకేశ్.... ప్రభాస్ అభిమానులు, తెదేపా మద్దతుదారులు సినిమాను చూసి ఇలాంటి అసత్య వార్తల్లో నిజం లేదని రుజువు చేయాలని’ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి :