బ్లూఫ్రాగ్ కంపెనీతో తనకు సంబంధం ఉందని వైకాపా నేతలు చేస్తున్న ప్రచారంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైకాపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బ్లూ ఫ్రాగ్ కంపెనీతో తనకు ఎటువంటి సంబంధం లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: