ETV Bharat / city

'పోలీసులను సీఎం.. పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు' - news on journalist arrest in ap

సీఎం జగన్ పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వినియోగించుకోవడం విచారకరమని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ శివ ప్రసాద్‌ను పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆరోపించారు.

lokesh on journalist arrest
నారా లోకేశ్ ట్వీట్
author img

By

Published : Aug 29, 2020, 11:49 AM IST

lokesh on journalist arrest
నారా లోకేశ్ ట్వీట్

జర్నలిస్ట్ శివ ప్రసాద్‌ను హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఎలాంటి నోటీసు లేకుండా ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడటమే అతను చేసిన తప్పా అని నిలదీశారు. వారెంట్, నోటీసు లేకుండా శివప్రసాద్ ఫోన్‌ను కూడా చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ను స్వాధీనం చేసుకుంటున్న ఘటన ఆడియోను జర్నలిస్ట్ కుటుంబం రికార్డ్ చేసిందన్న లోకేష్..., దానిని తన ట్విట్టర్ లో విడుదల చేశారు. నోటీసులు లేకుండా తన కుటుంబం ముందే శివప్రసాద్ ను ఎందుకు కిడ్నాప్ చేశారని లోకేశ్ నిలదీశారు. సీఎం జగన్ పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వినియోగించుకోవడం విచారకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని పోలీసులు తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారని లోకేశ్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అత్యధికుల అభిలాష అమరావతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.