రాజధాని ప్రాంతాలు... భారత్-పాక్ సరిహద్దును తలపిస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విమర్శించారు. అక్కడైనా ఇంత మంది పోలీసులు ఉండరని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుందన్నారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలని లోకేశ్ ట్విట్టర్‌లో సూచించారు.
ఇదీ చదవండి