ETV Bharat / city

జర్నలిస్టులను వేధించడం ముర్ఖత్వానికి పరాకాష్ట: లోకేశ్‌

వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసంపై వార్త రాసిన జర్నలిస్టులను వేధించడం దారుణమని లోకేశ్‌ అన్నారు.

author img

By

Published : Jan 9, 2021, 1:21 PM IST

lokesh
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

నిందితులను గాలికొదిలేసి సమాచారం ఇచ్చిన వ్యక్తులను, వార్త రాసిన జర్నలిస్టులను వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకతని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ముఖద్వారంపై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకు జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

రాష్ట్రంలో 140 ఘటనలు జరిగితే నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి సమాచారం బయటపెట్టిన వ్యక్తులు, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. వైకాపా నాయకుల ఒత్తిళ్లకు లొంగి అమాయకులపై కేసులు పెడుతున్న కొంతమంది పోలీసులు పర్యవసానం అనుభవించక తప్పదని హెచ్చరించారు. ముందే విగ్రహాలు విరిగిపోయాయని మాయచేస్తున్న ప్రభుత్వం మరమ్మత్తులు ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. వాస్తవాలు బయటకొచ్చాకా ఏదో తప్పుడు కథలు చెప్పడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

సైబర్​ మోసాల్లో వంద పోగొట్టుకుంటే తిరిగొచ్చేది 12 రూపాయలే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.