ETV Bharat / city

మీ అవినీతి గురించి మాట్లాడితే చంపేస్తారా..? : లోకేశ్‌ - ప్రొద్దుటూరులో తెదేపా నేత హత్య వార్తలు

ప్రశాంతంగా ఉన్న సీమలో వైకాపా నేతలు రక్తం పారిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. చేనేత‌ వ‌ర్గం నాయ‌కుడిని కిరాతకంగా హత్య చేశారన్నారు. ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై అధికార గర్వాన్ని అణిచివేస్తారని దుయ్యబట్టారు. అవినీతిని ఎండగడితే హత్య చేయిస్తారా? అంటూ లోకేశ్‌ ప్రశ్నించారు.

lokesh-comments
lokesh-comments
author img

By

Published : Dec 30, 2020, 9:49 AM IST

Updated : Dec 30, 2020, 12:31 PM IST

ప్రొద్దుటూరు నందం సుబ్బయ్య హత్య ఘటనను.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా ఉన్న సీమలో నెత్తురు పారిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ అండతో దుండగులు పేట్రేగిపోతున్నారని ధ్వజమెత్తారు.

ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై అధికార గర్వాన్ని అణిచివేస్తారని హెచ్చరించారు. వైకాపా ఎమ్మెల్యే అవినీతిని బయట పెట్టినందుకే కక్ష గట్టి చేనేత వర్గం నాయకుడు సుబ్బయ్యపై దాడికి ఒడిగట్టారని మండిపడ్డారు. అన్యాయంగా నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారంతో ఆ పిల్లలకు తండ్రిని తేగలరా అని నిలదీశారు.

  • మీ అవినీతిని ఎండగట్టినందుకు కక్షగట్టి టిడిపి జిల్లా అధికార‌ప్ర‌తినిధి నందం సుబ్బయ్యను ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారు.హత్య చేసిన ఎమ్మెల్యే,అతని బావమరిది బంగారురెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలి.(2/3)

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

దేశంలో 20 మందికి కొత్త రకం కరోనా నిర్ధరణ

Last Updated : Dec 30, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.