ETV Bharat / city

ఆ అప్పుకు నాలుగేళ్లపాటు మినహాయింపు.. రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు - అప్పుకు నాలుగేళ్లపాటు మినహాయింపు

Loan exception: దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కేంద్రం ఆర్థిక వెసులుబాటు కల్పించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు బడ్జెట్‌లో చూపకుండా చేసిన రుణాలను.. ఒకేసారి రుణ పరిమితి నుంచి మినహాయించబోమని స్పష్టం చేసింది. అప్పు ఎంత తీసుకుంటే అంత మొత్తాన్ని నాలుగేళ్లపాటు సమంగా మినహాయించి.. 2026 మార్చి వరకూ రుణ పరిమితిని నిర్దేశిస్తామని స్పష్టం చేసిందని సమాచారం.

loan exception for four years to states says union government
ఆ అప్పుకు నాలుగేళ్లపాటు మినహాయింపు
author img

By

Published : Jul 14, 2022, 7:34 AM IST

Loan exception: దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కేంద్రం ఆర్థిక వెసులుబాటు కల్పించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు బడ్జెట్‌లో చూపకుండా చేసిన రుణాలను ఒకేసారి రుణ పరిమితి నుంచి మినహాయించబోమని స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో చూపకుండా.. అప్పు ఎంత తీసుకుంటే అంత మొత్తాన్ని నాలుగేళ్లపాటు సమంగా మినహాయించి 2026 మార్చి వరకూ రుణ పరిమితిని నిర్దేశిస్తామని స్పష్టం చేసిందని సమాచారం. రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఈ ఏడాది రాష్ట్రాల రుణ పరిమితి పెరగనుంది.

ప్రతి రాష్ట్రమూ తన స్థూల జాతీయోత్పత్తిలో 3.5శాతం మేర ఆ ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకోవచ్చని నీతి ఆయోగ్‌ నిర్దేశించింది. అంతకుమించి అప్పు చేసేందుకు వీలు లేదు. విద్యుత్తు రంగంలో సంస్కరణలు చేపడితే 0.5శాతం అదనంగా అప్పు తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పిస్తుంది. అయితే రాష్ట్రాలు బహిరంగ రుణం పొందడమే కాకుండా బడ్జెట్‌లో చూపకుండా కూడా అప్పులు చేస్తున్నాయి.

అలా బడ్జెట్‌లో చూపకుండా రాష్ట్రాలు అప్పులు చేయడంవల్ల ఆ ప్రభావం రాష్ట్రాల ఆదాయం, ద్రవ్యలోటుపై పడుతోంది. దీంతో కేంద్ర ఆర్థికశాఖ ఈ ఏడాది మార్చి నెలలో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. 2020-21, 2021-22ల్లో బడ్జెట్‌లో చూపకుండా చేసిన అప్పుల వివరాలు కావాలని కోరింది. 2022-23కు సంబంధించి రాష్ట్రాల రుణ పరిమితిని నిర్ణయించేప్పుడు బడ్జెట్‌లో చూపని రుణాల మొత్తాన్ని కేంద్రం మినహాయిస్తుంది.

దీని వల్ల తమకు ఇబ్బందిగా ఉందని రాష్ట్రాలు తెలియజేయడంతో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఆ ఏడాది బడ్జెట్‌లో చూపకుండా చేసిన అప్పుల మొత్తాన్ని నాలుగేళ్ల పాటు మినహాయింపునకు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.

  • రాష్ట్రం ఇప్పటికీ తన రుణాలను తక్కువ చేసి చూపిస్తోందని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రజాపద్దు రుణమే తక్కువ చేసి చూపించిందనేది ప్రధాన ఆరోపణ. రాష్ట్రం తన అప్పుల వివరాలు సమగ్రంగా వెల్లడించని క్రమంలో కొత్తగా వచ్చిన వెసులుబాటు నుంచి అధికంగా పొందే ప్రయోజనం ఏముంటుందనే సందేహం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.