తుది ఉత్పత్తులను విక్రయించుకునేందుకు అనుమతించాలన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ అభ్యర్ధనపై.. తుది నిర్ణయం న్యాయస్థానానిదేనని ప్రభుత్వం తేల్చింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్పత్తుల విక్రయం జరిగేలా చూడాలని.. వచ్చిన సొమ్మును కలెక్టర్ వద్ద జమ చేసేలా ఆదేశించాలని ప్రభుత్వం కౌంటర్ లో పేర్కొంది.
ఈ మేరకు ప్రభుత్వం తరఫున పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వెలవెన్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తుది ఉత్పత్తులను విక్రయించుకోవడానికి అనుమతించి.. పరిశ్రమపై సీజర్ ఉత్తర్వులను ఎత్తివేయాలని ఎల్జీ పాలిమర్స్ అనుబంధ పిటిషన్లు దాఖలు చేసింది. పాలిమర్స్ ప్లాంట్లో కొన్ని ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కౌంటర్ వేశారు.
వాటిని నిర్దిష్ట ఉష్ణోగ్రతలో నిర్వహించాల్సి ఉన్నందున.. 24 గంటలూ నిపుణులు అందుబాటులో ఉండాలని న్యాయస్థానానికి చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ భవనాలు, యంత్రాల వినియోగంపై డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్.. నిషేధాజ్ఞలు జారీ చేశారన్నారు. స్టైరీన్ లీక్ పై చట్టబద్ధ సంస్థలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు విచారణ జరుపుతాయని.. అవసరమైతే కంపెనీ ప్రతినిధుల్ని విచారిస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి: