చిరుత సంచారం రైతులను భయాందోళనలకు గురి చేస్తోంది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ, చిట్యాలపల్లి గ్రామాల మధ్య పొలాల్లో చిరుత కనిపించినట్లు రైతులు తెలిపారు.
సమాచారం అందుకున్న అటవీ అధికారి వేణు భరన్ పాదముద్రలు పరిశీలించారు. పొలం పనులకు ఒంటరిగా వెళ్లొద్దని చిట్యాలపల్లి గ్రామ సర్పంచ్ సురేశ్ హెచ్చరించారు. రాత్రి వేళల్లో చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న గ్రామస్థులు బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని అటవీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.