ETV Bharat / city

అమరావతి కార్పొరేషన్​కు వ్యతిరేకంగా.. కురుగల్లు గ్రామస్థుల తీర్మానం

Kurugallu Opinion on Amaravathi Corporation
అమరావతి కార్పొరేషన్‌ కు మేం వ్యతిరేకం -కురుగల్లు గ్రామస్థులు
author img

By

Published : Jan 5, 2022, 12:24 PM IST

Updated : Jan 5, 2022, 1:48 PM IST

12:22 January 05

Kurugallu Opinion on Amaravathi Corporation : అమరావతి కార్పొరేషన్‌ కు మేం వ్యతిరేకం -కురుగల్లు గ్రామస్థులు

Kurugallu Villagers on Amaravathi Corporation : అమరావతి కేపిటల్ సిటీని మునిసిపల్ కార్పొరేషన్​గా ఏర్పాటు చేయడం కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా.. కురుగల్లులో గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ గ్రామసభలో మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న నాయక్.. అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు గురించి వివరించారు. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుతో సీఆర్డీఏకు నష్టం లేదని ఆయన అన్నారు. సీఆర్డీఏ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుపై స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పాలని ఆయన కోరారు. అయితే.. కురుగల్లు గ్రామస్థులు మాత్రం.. అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ గ్రామస్థులు తీర్మానం చేశారు. కురుగల్లును అమరావతి కార్పొరేషన్‌లో కలపడం తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. గ్రామస్థుల తీర్మానాన్ని మంగళగిరి ఎంపీడీవో రాంప్రసన్న నాయక్ వెల్లడించారు.

ఇదీ చదవండి : అమరావతి కార్పొరేషన్ పై.. ప్రజాభిప్రాయసేకరణ

Last Updated : Jan 5, 2022, 1:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.