ETV Bharat / city

KRISHNA BOARD: జల వివాదం..రంగంలోకి కృష్ణా బోర్డు - నీటి యుద్ధం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం రోజురోజుకు ముదుకుతున్న తరుణంలో కృష్ణా బోర్డు రంగంలోకి దిగింది. ఈ నెల 9న రెండు రాష్టాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, బోర్డు కార్యదర్శితో సమస్య పరిష్కారంపై చర్చించనుంది. సమస్యను కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

KRISHNA BOARD
రంగంలోకి కృష్ణా బోర్డు
author img

By

Published : Jul 3, 2021, 4:01 AM IST

Updated : Jul 3, 2021, 6:33 AM IST

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రమైన నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. నీటి విడుదల, వివిధ అంశాలపై తలెత్తే వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, బోర్డు కార్యదర్శితో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ 9న సమావేశమై చర్చించనుంది. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలను సమావేశంలోగా పంపాలని రెండు రాష్ట్రాల ఇఎన్‌సిలను బోర్డు శుక్రవారం కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. విద్యుదుత్పత్తి ద్వారా నీటి విడుదలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.

ఈ సమావేశానికి ముందుగానే బోర్డు కొత్త ఛైర్మన్‌ ఎం.పి. సింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రాయలసీమ ఎత్తిపోతల పర్యటన సహా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న పలు అంశాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్‌, పులిచింతలలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేపట్టడం, దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌.. ప్రధానమంత్రికి, కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో తాజా పరిస్థితి గురించి వివరిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు శుక్రవారం లేఖ రాసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై కొద్ది రోజుల క్రితం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ లేఖ రాయగా, నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగించడంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పుడు మళ్లీ తాజా పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఈ నెల 12లోగా నివేదిక ఇవ్వాల్సి ఉందని, అయితే ఆంధ్రప్రదేశ్‌ సహకరించడం లేదని కూడా నివేదించినట్లు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల పర్యటనకు నియమించిన కమిటీపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని పేర్కొంటూ, గోదావరి నుంచి మళ్లించే నీటిలో వాటా తేల్చడంపై గతంలో నియమించిన బజాజ్‌ కమిటీ ఏమీ తేల్చకుండానే కాలపరిమితి ముగియడం, ఇతర పెండింగ్‌ అంశాలన్నింటినీ సమగ్రంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

"రాయలసీమ అవస్థలు మాకు తెలుసు.. దానికి శాశ్వత పరిష్కారం చూపడంలో నేను ముందుంటా అని అప్పుడు కేసీఆర్‌ అన్నారు. దాని ప్రకారమే కాల్వల వెడల్పు కోసం నమూనాలను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాం. ఎత్తిపోతల పథకానికీ అనుమతి కోరాం." -ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

"కృష్ణా బేసిన్‌లోని అవసరాలు తీర్చకుండా మరో బేసిన్‌కు తరలించకూడదని నీటి పారుదల నిపుణులు చెప్పినా ఏపీ పట్టించుకోవట్లేదు. కేంద్రం ఈ పరిణామాలపై ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో లేని పథకాన్ని చేపట్టే హక్కు జగన్‌కు ఎక్కడిది?" -తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఇదీ చదవండి:

AP-TS-WATER ISSUE: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా

Last Updated : Jul 3, 2021, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.