ETV Bharat / city

Konda: భాజపా గూటికి కొండా విశ్వేశ్వరరెడ్డి - Konda joined bjp

తెలంగాణలో భాజపా అధికారంలో వస్తుందన్న విశ్వాసముందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెరాసను ఎదుర్కోవాలంటే ఒక్క భాజపా వల్లే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే భాజపా చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని కొండా ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందనుకుంటే అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు.

భాజపా గూటికి కొండా విశ్వేశ్వరరెడ్డి
భాజపా గూటికి కొండా విశ్వేశ్వరరెడ్డి
author img

By

Published : Jun 30, 2022, 9:42 PM IST

భాజపా గూటికి కొండా విశ్వేశ్వరరెడ్డి

తెలంగాణలో భాజపా అధికారంలో వస్తుందన్న విశ్వాసముందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెరాసను ఎదుర్కోవాలంటే ఒక్క భాజపా వల్లే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే భాజపా చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని కొండా ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందనుకుంటే అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందన్నారు. రాష్ట్రంలో 75 శాతం ప్రజలు కేసీఆర్‌పై వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయింది. భాజపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నా. నేను రేవంత్‌రెడ్డికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్‌కు పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్‌కు సకాలంలో పీసీసీ ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండేవాడ్ని. భాజపా పూర్తి క్రమశిక్షణ కలిగిన పార్టీ. తాను పదవులు ఆశించి భాజపాలోకి వెళ్లడం లేదు.

- కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి శూన్యమని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన పువ్వాడ, తలసాని ప్రస్తుతం తెరాసలో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉందని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా హుజూరాబాద్ ఫలితాలే వస్తాయని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలో వస్తుందన్న విశ్వాసముందని తెలిపారు.

ప్రధాని భాజపాలో చేరతా: కొండా

జులై 2 లేదా 3న ప్రధాని, నడ్డా, అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరతానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. తాను ఎంపీ పదవికే సరిపోతానని.. నాకు అదే ఆసక్తి ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేగా పోటీచేయమని అధిష్ఠానం చెబితే చేస్తానని స్పష్టం చేశారు. ఉత్తమ్, కోమటిరెడ్డి సోదరులను మర్యాదపూర్వకంగా కలిశానని కొండా పేర్కొన్నారు. ఉత్తమ్‌, కోమటిరెడ్డి సోదరులు శుభాకాంక్షలు చెప్పారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.