ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కియా కార్ల పరిశ్రమ నుంచి మొట్టమొదటి కారు మార్కెట్లోకి వచ్చింది. ఎస్యూవీ మోడల్ కియా సెల్టోస్ ఇప్పటికే విడుదల చేసింది. బీఎస్6 ప్రమాణాలతో కూడిన ఇంజిన్, ఫ్యూయల్ ఎఫిషియంట్ సాంకేతికత, స్మార్ట్ ఫీచర్లతో ఈ కారు ఎస్యూవీ మోడళ్లలో తమను అగ్రస్థానంలో నిలుపుతుందని కంపెనీ భావిస్తోంది. కియా సెల్టోస్ కారుకు సంబంధించిన బుకింగ్స్, అన్ విల్లింగ్ ఇప్పటికే ప్రారంభమవగా.. ఆగస్టు 22న కార్ల డెలివరీ, ప్రైస్ రివీల్ లాంఛనంగా జరగనుంది. దేశవ్యాప్తంగా 269 టచ్ పాయింట్స్, 160కు పైగా సర్వీస్ సెంటర్లను ఇప్పటికే ప్రారంభించగా.. వాహన ప్రేమికులు, ఆటోమొబైల్ రంగంలో కియా సెల్టోస్‌పై అంచనాలు పెంచేసింది. ఈ తరుణంలో గోవా నగర వీధుల్లో టెస్ట్ డ్రైవ్‌ను కంపెనీ నిర్వహించింది.
ఆగస్టు 22 నుంచి కియా కార్ల డెలివరీ - car
చక్కని డ్రైవింగ్ అనుభవం, అధునాతన ఫీచర్లతో తమ కారు యువతరాన్ని ఆకట్టుకుంటుందని దక్షిణకొరియాకు చెందిన కియా కార్ల కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కియా ఉత్పాదక కేంద్రం ఏడాదికి 3 లక్షల ఉత్పత్తి సామర్ధ్యంతో పనిచేస్తుందని కియా ప్రకటించింది. ఎస్యూవీ మోడల్ కియా సెల్టోస్ మార్కెట్లోకి తెచ్చింది.