ETV Bharat / city

మార్కెట్లోకి  'మేడిన్ ఆంధ్రా' కారు

మార్కెట్లోకి కియా సెల్టోస్‌ కారు లాంఛనంగా విడుదలైంది. కియా పరిశ్రమలో కారును మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శంకరనారాయణ విడుదల చేశారు. వాణిజ్య కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

author img

By

Published : Aug 8, 2019, 3:42 PM IST

Updated : Aug 8, 2019, 6:28 PM IST

kia-car-launching
మార్కెట్లోకి 'మేడిన్ ఆంధ్రా' కారు

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి గర్వకారణమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఏర్పాటైన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ పరిశ్రమ నుంచి తొలికారు మార్కెట్‌లోకి వచ్చింది. 'మేడిన్ ఆంధ్రా' కియా కారు.... ఇవాళ్టి నుంచి రయ్‌మని దూసుకెళ్తుంది. సెల్టోస్ మోడల్ వాహనాన్ని కియా సంస్థ ఆవిష్కరించింది. నవ్యాంధ్రకు తలమానికంగా నిలిచే కియా మోటార్స్ కార్ల తయారీ పరిశ్రమ... వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటైన పరిశ్రమ నుంచి... ఏటా 3 లక్షల కార్లు ఉత్పత్తి చేయనున్నారు. సంస్థలో తయారైన తొలి కారును ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని భావించినా... వరద పర్యటనలో ఉన్నందున ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శంకరనారాయణ ఆవిష్కరించారు.

కరవు నేలలో కార్లు పండుతున్నాయ్‌...

దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా, రాష్ట్రంలో కరవుకు ప్రతిరూపంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా.. ఇకపై కార్ల పరిశ్రమ జిల్లాగా ఖ్యాతిగాంచనుంది. వాస్తవానికి దేశంలో తొలి ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు కియా ప్రతినిధులు ఎన్నో రాష్ట్రాలను పరిశీలించారు. ఇందులో భాగంగా 2016లో పలు దఫాలు అనంతపురం జిల్లాకూ వచ్చారు. భూముల కోసం అన్వేషణ చేశారు. కర్ణాటక, తమిళనాడుతోపాటు, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కియాను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రత్యేక చొరవ చూపి ‘కియా మోటార్స్‌’ను అనంతపురానికి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు.

సెల్టోస్‌ కారు విశేషాలు ...

దక్షిణకొరియాకు చెందిన కార్లతయారీ సంస్థ కియా భారతీయ మార్కెట్లో విడుదల చేసిన సెల్టోస్‌ ఎస్‌యూవీ హుందయ్‌ క్రెటా, ఎంజీ హెక్టార్‌, టాటా హారియర్‌ శ్రేణిలోకి వస్తుంది. వినియోగదారులను ఆకట్టుకునే రూపంలో తయారు చేశారు. ఈ కారు టెక్‌లైన్‌, జీటీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టెక్‌లైన్‌లో కేవలం కారు బాహ్యభాగం తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టారు. ఇక జీటీ లైన్‌లో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి తెచ్చారు. దీనిలో నేవిగేషన్‌తో కూడిన 10.25 టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంది. దీనిని బోస్‌ 8 స్పీకర్ల సౌండ్ సిస్టమ్‌ అమర్చారు. కారులో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను అమర్చారు. దీన్ని మొదటి రెండు సీట్ల మధ్యలో అమర్చారు. 360 డిగ్రీలను కవర్‌ చేసే విధంగా కెమెరా ఈ కారులో ఏర్పాటు చేశారు. ఈ సెగ్మెంట్‌లో తొలిసారి ఈ ఫీచర్‌ తీసుకొచ్చారు. ఇక కారును నార్మల్‌, ఎకో, స్పోర్ట్స్‌ మోడ్‌లో నడపవచ్చు.

ఈ కారు 1.4లీటర్‌ టర్బో జీడీఐ పెట్రోల్‌ ఇంజిన్‌, 1.5లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌లో లభిస్తోంది. దీనిలో 7స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌, 6స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌, సీవీటీ ఆటోమేటిక్‌, 6స్పీడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్లను ఆప్షన్లుగా ఇస్తోంది. 6ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్‌, ఈబీడీ, ఈఎస్‌సీ, హెచ్‌ఏసీ, వీఎస్‌ఎంలు ఉన్నాయి. దీనిని అత్యంత శక్తివంతమైన ఏహెచ్‌ఎస్‌ఎస్‌ ఉక్కుతో నిర్మించారు.

Intro:ATP:- అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ రావడానికి ముఖ్య కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి అన్నారు. అనంతపురంలోని తెదేపా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు ఒక వరం అని గుర్తు చేశారు. ఆనాడు చంద్రబాబు కృషితోనే జిల్లాకు పరిశ్రమ వచ్చిందని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కియా కార్లు విడుదల విడుదల చేయడం చరిత్రలో నిలిచిపోయే విషయమన్నారు. అత్యంత కరువు ప్రాంతమైన జిల్లాకు వలసలు నివారించడానికి కియా పరిశ్రమ ఎంతగానో తోడ్పడిందన్నారు. అయితే ఒకప్పుడు అడ్డు చెప్పిన వైకాపా నాయకులు నేడు అంతా చేసినట్లు ఆర్బాటాలు చేయడం హాస్యాస్పదంగా వుందన్నారు.

Body:కియా పరిశ్రమ రావడానికి మూడు రాష్ట్రాల్లో పోటీ పడగా అందులో ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేశారన్నారు. కియా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడి జిల్లాకు వచ్చేలా ఎంతగానో కృషి చేశారన్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి కియా పరిశ్రమ రావడానికి కృషి చేశారని వైకాపా నాయకులు చెప్పడం ఎంతో మంచి అబద్ధం గా ఉందని దీనిని ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పారు. ఏది ఏమైనా కియా ప్రతినిధులకు తెలుగుదేశం తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాము అన్నారు. కియా ప్రతినిధులు స్థానికంగా ఉంటున్న వారికి 90 శాతం ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు.

బైట్స్ ..1..కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి ఆంధ్ర ప్రదేశ్ 2.....బి.కె పార్థసారథి, తెదేపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
Last Updated : Aug 8, 2019, 6:28 PM IST

For All Latest Updates

TAGGED:

kiacar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.