ETV Bharat / city

సహకారశాఖను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు: మంత్రి కన్నబాబు - Kannababu updates

సహకార శాఖపై మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. కొన్ని విభాగాలను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

Kannababu Review on Cooperative Sector
సహకారశాఖపై మంత్రి కన్నబాబు సమీక్ష
author img

By

Published : Mar 23, 2021, 3:08 PM IST

సహకార శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కార్యాచరణ చేపట్టినట్టు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కె.కన్నబాబు స్పష్టం చేశారు. ఆ శాఖలో సంస్కరణల అమలు కోసం ఆప్కాబ్ కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదికపై మంత్రి సమీక్షించారు. ఆర్థిక కార్యకలాపాల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రాథమిక సహకార సంఘాలు, జిల్లా సహకార బ్యాంకులు, మార్కెటింగ్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకంపైనా మంత్రి సమీక్షించారు.

ఆడిటింగ్ చేయిస్తాం: కన్నబాబు

సహకార శాఖలో మానవ వనరుల నూతన విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఆడిటింగ్ విధానాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని... అనుభవం, అర్హత కలిగిన అధికారులతో క్రమం తప్పకుండా ఆడిటింగ్ చేయిస్తామని మంత్రి ప్రకటించారు. జిల్లాల వారీగా సహకార శాఖల పనితీరు, రుణ పరిమితులు, సిబ్బంది మార్పుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

భారత్ బంద్​కు తెదేపా మద్దతు: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.