ETV Bharat / city

రాజధాని బిల్లులు ఆమోదించొద్దు: గవర్నర్‌కు కన్నా లేఖ - ఏపీ సీఆర్డీఏ రద్దు బిల్లులు న్యూస్

kanna laxminarayana letter to governer bishwa bhushan over capital bills

author img

By

Published : Jul 18, 2020, 5:46 PM IST

Updated : Jul 18, 2020, 6:19 PM IST

17:44 July 18

రాజధాని బిల్లులు ఆమోదించవద్దని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని లేఖలో అభిప్రాయపడ్డారు.

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిందని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఆ రెండు అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున.. ధిక్కారం కిందకు వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం బాండ్ల రూపంలో 2 వేల కోట్ల రూపాయలు సమీకరించిందని... అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా నిధులు ఇచ్చిందని గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​కు రాసిన లేఖలో కన్నా వివరించారు. 

రాజధాని కోసం అక్కడి రైతులు 32 వేల ఎకరాల భూమి ఇచ్చారని... వారు చేస్తున్న శాంతియుత పోరాటాన్ని గుర్తించాలని కోరారు. రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించడంతోపాటు ప్రజల ఆకాంక్షలు పరిగణించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్​కు కన్నా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పంపించే బిల్లులు ఆమోదించవద్దని భాజపా తరఫున కోరుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

Last Updated : Jul 18, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.