పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలమని స్పష్టం చేసిన సీఎం జగన్.. సీఏఏకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు అనుమతి ఎలా ఇస్తున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారా అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సీఏఏకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీల్లో పాల్గొంటూ వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : జనాభా లెక్కల సేకరణలో కులగణన లేనట్లే