ETV Bharat / city

మన చెరువులకు అంతర్జాతీయ గౌరవం - kc canal news

ప్రపంచ చారిత్రక నీటి పారుదల కట్టడాల జాబితాలో రాష్ట్రంలోని కంభం, పోరుమామిళ్ల చెరువులు, కేసీ కాలువలకు చోటు లభించింది.

International respect for AP state ponds
మన చెరువులకు అంతర్జాతీయ గౌరవం
author img

By

Published : Nov 30, 2020, 7:27 AM IST

శ్రీకృష్ణదేవరాయల హయాంలో నిర్మించిన కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువు, బ్రిటిషు పాలనలో నిర్మించిన కేసీ కాలువలకు ప్రపంచ చారిత్రక నీటి పారుదల కట్టడాల (వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన్‌ స్ట్రక్చర్స్‌) గుర్తింపు లభించింది. 2020 సంవత్సరానికిగానూ ప్రపంచంలోని 14 సాగునీటి ప్రాజెక్టులకు స్థానం లభించగా, ఇందులో భారతదేశంలో నాలుగింటికి అవకాశం లభించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి మూడు ఉండగా.. మహారాష్ట్రలోని ధామాపూర్‌ చెరువు మరొకటి. ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రెయినేజీ సంస్థకు (ఐ.సి.ఐ.డి) చెందిన న్యాయనిర్ణేతల బృందం అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఎంపిక చేసింది.

రాయల కాలం నాటి కంభం చెరువు

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్‌లోని కంభం చెరువు చారిత్రక ప్రసిద్ధి చెందినది. గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ఈ చెరువు ఆసియాలోనే రెండో అతి పెద్ద సాగునీటి చెరువు. 500 ఏళ్లక్రితం నిర్మించిన ఈ చెరువు కింద 10,300 ఎకరాల ఆయకట్టు ఉంది. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల సతీమణి, ఒడిశాలోని గజపతుల కుమార్తె అయిన వరద రాజమ్మ (రుచిదేవి) ఈ దారిన వెళ్తూ చెరువు నిర్మాణం చేపట్టాలని సూచించారని, ఆమె సూచనకు అనుగుణంగా కంభం చెరువు నిర్మాణం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ చెరువు 7 కి.మీ. పొడవు, 3.5 కి.మీ. వెడల్పు ఉంది.

500 ఏళ్లనాటి పోరుమామిళ్ల చెరువు

కడప జిల్లా పోరుమామిళ్లలోని ఈ చెరువుకూ 500 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. 1903లో బయటపడిన శాసనం ద్వారా ఈ చెరువు చరిత్ర వెలుగు చూసిందని నీటి పారుదలశాఖ వర్గాలు తెలిపాయి. విజయనగర రాజు మొదటి బుక్కరాయులు కుమారుడు భాస్కరుడు (భవదూరుడు) ఉదయగిరి రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు వేసిన పోరుమామిళ్ల శాసనం బట్టి ఆ సమయంలోనే ఈ చెరువు నిర్మాణం జరిగిందని అంచనాకు వచ్చారు. ఈ చెరువు కింద 3,864 ఎకరాల ఆయకట్టు ఉంది.

130 సంవత్సరాల కేసీ కాలువ

నదుల అనుసంధానం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ.. ఎప్పుడో బ్రిటిషు హయాంలో నిర్మించిన కేసీ కాలువ.. తుంగభద్ర-పెన్నా అనుసంధానం. 1863-70 సంవత్సరాల మధ్య రవాణా, సాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మించారు. తుంగభద్రపై నిర్మించిన సుంకేశుల బ్యారేజి నుంచి నీటిని మళ్లించి కడప జిల్లా కృష్ణరాజపురం వరకు నిర్మించారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ సూచన మేరకు రవాణా తగ్గించడంతో సాగునీటి ప్రాజెక్టుగా మారింది. 1933 నాటికి పూర్తి సాగునీటి పథకంగానే మారింది. ప్రైవేటు డచ్‌ కంపెనీ అయిన మద్రాస్‌ ఇరిగేషన్‌ అండ్‌ కెనాల్‌ కంపెనీ దీని నిర్మాణం చేపట్టింది. ఈ సంస్థ పూర్తి చేయలేకపోవడంతో మధ్యలో వేరే సంస్థకు అప్పగించారు.

నూరేళ్లకు పైగా చర్రిత ఉన్న ప్రాజెక్టుల నుంచి ఎంపిక

నూరేళ్లకు పైన చరిత్ర ఉండి నిర్వహణలో ఉన్న చారిత్రక సాగునీటి కట్టడాల నుంచి ఏటా ఈ ఎంపిక జరుగుతుందని ఐ.సి.ఐ.డి ఉపాధ్యక్షుడు కలువాయి ఎల్లారెడ్డి తెలిపారు. ఎంట్రీలను పంపాలని అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాశామని, ఇందులో మహారాష్ట్ర నుంచి ఒకటి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడింటిని న్యాయనిర్ణేతల బృందం ఎంపిక చేసిందని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:

వంతెన కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న గన్నవరం గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.