ETV Bharat / city

84 శాతం పైగా ప్రజల్లో తెదేపాపై సంతృప్తి ఉంది: కళా వెంకట్రావు

ఓ ఛానల్ చేపట్టిన పోల్ సర్వేలో తెదేపా, వైకాపా మధ్య ఓట్ల తేడా కేవలం 6శాతం మాత్రమే చూపించారని దానిపై తనకు నమ్మకం లేదని తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ప్రభుత్వం సర్వే, పార్టీ చేసిన సర్వే, ఇతర స్వచ్చంద సంస్థల అంచనాల్లో తేదేపాకి 84శాతంకు పైగా సంతృప్తి ప్రజల్లో ఉందనేది అనేకమార్లు వెల్లడైందన్నారు.

కళా వెంకట్రావు, తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు
author img

By

Published : Apr 5, 2019, 4:53 AM IST

5ఏళ్లలో తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని ఆ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఉద్ఘాటించారు. ఓ ఛానల్ చేపట్టిన పోల్ సర్వేపై తనకు నమ్మకం లేదన్నారు. ఆ సర్వేలో తెదేపా 43శాతం , వైకాపా 37శాతం, భాజపా 7శాతం , కాంగ్రెస్ 6శాతం ఇతరులు 4శాతం , డికె/ సీఎస్ 3శాతం గా ఆ పేర్కొన్నారు. దాని ప్రకారం తెదేపా, వైకాపా మధ్య ఓట్ల తేడా కేవలం 6శాతం మాత్రమే చూపించారు. వాస్తవంగా చూస్తే అంతకు రెట్టింపు ఓట్ల తేడా ఉంటుందని అయన తెలిపారు.
సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత చంద్రబాబుదే....
గతంలో ప్రపంచం, మనదేశం పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం, క్షీర విప్లవాలనే చూసిందని... అలాంటిది మొదటిసారిగా ఇప్పుడు సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 24వేల 500కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ వల్ల 55లక్షల రైతు కుటుంబాలకు మేలు జరిగిందని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. తాజాగా ఇప్పుడు అన్నదాత సుఖీభవ కింద 60లక్షల మంది రైతులకు 15వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.
అందరి మద్దతు తెదేపాకే...
ప్రతినెలా ఒకటో తేదీనే పించన్లు పొందుతున్న 54లక్షల మంది వృద్ధులు, వికలాంగులు,ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు అందరి మద్దతు తెదేపాకే ఉందని అన్నారు. 22వేల కోట్ల ‘పసుపు-కుంకుమ’ పొందిన 90లక్షల మహిళలు తెలుగుదేశం వెంటే ఉన్నారన్నారు. ప్రతినెలా నిరుద్యోగ భృతి పొందుతున్న 5లక్షల మంది యువత, నైపుణ్యాభివృద్ది పొందిన 8లక్షల మంది యువత మద్దతు తెదేపాకే అని కళా వ్యాఖ్యానించారు.
ప్రతి ఒక్కరూ లబ్ది పొందిన వారే...
2వేల 400కోట్ల రూపాయలు చంద్రన్న బీమా పొందిన కుటుంబాలు, 5వేల 800కోట్లు ఎన్టీఆర్ వైద్యసేవ పొందిన కుటుంబాలు, 1,500 కోట్ల సీఎంఆర్ ఎఫ్ పొందిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ పొందిన విద్యార్ధులు, ఉద్యోగాలు పొందిన 9లక్షల యువతీ యువకులు, సొంత ఇళ్లలో గృహ ప్రవేశం చేసిన 11లక్షల కుటుంబాల మద్దతు తమ పార్టీకే ఉంటుందని కళా చెప్పారు.
84 శాతం మంది ప్రజల మద్దతు తెదేపాకే...
ప్రభుత్వం సర్వే, పార్టీ చేసిన సర్వే, ఇతర స్వచ్చంద సంస్థల అంచనాల్లో తేదేపాకి 84శాతంకు పైగా సంతృప్తి ప్రజల్లో ఉందనేది అనేకమార్లు వెల్లడైందని తెలిపారు. తెదేపా అభ్యర్ధుల పర్యటనల్లో గ్రామ గ్రామానా, వా ర్డువార్డునా ప్రజల్లో ఆదరణే పార్టీ పట్ల ఉన్న సానుకూలతను ప్రతిబింబిస్తోందని కళా వెంకట్రావు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ తథ్యం అని స్పష్టం చేసారు. 25ఎంపీ సీట్లలో, 150 పైగా అసెంబ్లీ సీట్లలో తెదేపా అభ్యర్ధులే ఘన విజయం సాధిస్తారని కళా ధీమా వ్యక్తం చేసారు.

ఇవీ చూడండి. ఆంధ్రావాళ్ల జోలికి ఎవరు వచ్చినా వదలను: సీఎం

Intro:Ap_Vsp_92_04_Street_Hackers_Support_To_Tdp_Ab_C14
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) దక్షిణ నియోజకవర్గం లోని రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే ఎంత తమ మద్దతును తెలుగుదేశం పార్టీకే తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు.

Body:తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే తమకు హ్యాకర్స్ జోన్ ఏర్పాటు ద్వారా తమకు సొంత షాపులు ఏర్పాటయ్యాయని చిరు వ్యాపారులు తెలిపారు. విశాఖ నగరంలో ఎక్కువ శాతం చిరువ్యాపారులు దక్షిణ నియోజకవర్గంలోనే ఉన్నారని.. ఆర్టీసీ కాంప్లెక్స్, పూర్ణ మార్కెట్, బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ వంటి ప్రదేశాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. తామంతా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దక్షిణ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీ భరత్ కు తమ మద్దతును తెలియజేస్తున్నామని తెలిపారు.

Conclusion:సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా చిరు వ్యాపారులంతా తెలిపారు.

బైట్: బాలాజీ, చిరు వ్యాపారులస్తుల సమైక్య సంఘం. అధ్యక్షుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.