రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ వైద్యుల (Junior Doctors) చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. జూడాలతో మంత్రి ఆళ్ల నాని(minister alla nani) , ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని జూడాలు వెల్లడించారు. ఆర్థిక భరోసా హామీతో పాటు.. 15 శాతం మేర స్టైఫండ్ పెంచాలని కోరామని తెలిపారు.
'ప్రభుత్వానికి మరింత ఎక్కువే స్టైఫండ్ పెంచే ఆలోచన ఉంది. సీఎం (cm jagan)దృష్టికి తెచ్చి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కొవిడ్ బారిన పడిన వైద్యులకు ఉచిత వైద్య సేవలు కోరాం. సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు ఉచితంగా అందిస్తామన్నారు. ఆర్థిక భరోసా హామీతో పాటు.. 15 శాతం మేర స్టైఫండ్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరాం '- జూనియర్ వైద్యులు
ఇదీ చదవండి
Jagan delhi tour: ముఖ్యమంత్రి జగన్ రేపు దిల్లీ వెళ్లే అవకాశం