భాజపా, జనసేన అగ్రనేతలు పంచాయతీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నికలో అనుసరించబోయే వ్యూహం, ఎంపీ స్థానం, కార్యకర్తల సమాయత్తం వంటి అంశాలపై భేటీ నిర్వహించారు. అలాగే భాజపా ముఖ్యనేతల్ని ప్రచారానికి ఆహ్వానించనున్నారు. అభ్యర్థి ఎంపికపై ఇంకో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్ధుల వివరాలను పరిశీలించిన తరువాత అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చించారు. ఎన్నికల కమిషన్ పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు తప్పుబట్టారు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని, అలా గౌరవించకపోతే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి. వైకాపా ఎంపీలతో సీఎం జగన్ భేటీ