ETV Bharat / city

నీటిలో పంటలు.. పోషకాల సిరులు

సారవంతమైన భూమి కాదు.. అసలు మట్టే అవసరం లేదు. కేవలం నీరు.. కొన్ని పోషకాలు.. నియంత్రిత వాతావరణం.. ఈ మూడింటితోనే పంటలు పండుతున్నాయి.. నాణ్యమైన, సేంద్రీయ ఆకు కూరలు, కూరగాయలు అందుతున్నాయి. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో పశుగ్రాసం ఉత్పత్తిపై ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలు చేపట్టి లాభసాటేనని వెల్లడించింది. పెద్ద హోటళ్లలో సలాడ్‌లు, సూప్‌ల తయారీకి ఈ విధానంలో పండించిన ఆకుకూరలు, కూరగాయల్నే ఎక్కువగా వినియోగిస్తుండడం మరో విశేషం. ఇలా పండిన కూరలతో సలాడ్‌లు, సూప్‌లు రుచికరంగా ఉంటున్నాయని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.

neetilo pantalu
neetilo pantalu
author img

By

Published : Jan 8, 2021, 8:58 AM IST

తెలంగాణ జయశంకర్‌ వర్సిటీ.. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌) సూచనతో హైడ్రోపోనిక్స్‌ విధానంలో పశుగ్రాసాల సాగు ప్రాజెక్టు చేపట్టింది. తొలుత బొబ్బర్లు, మొక్కజొన్నను నీటిలో పెంచారు. విత్తనం వేసినప్పటి నుంచి 9 రోజుల్లోనే నీటి ట్రేలలో మొక్కజొన్న పైరు పశువుల మేతకు ఉపయోగించే స్థాయికి పెరిగింది. కిలో మొక్కజొన్న విత్తనాలను రూ.15కు కొనగా వాటి నుంచి 5 కిలోల మేత వచ్చింది. ఒక చదరపు మీటరు ట్రేలో 2.2 కిలోల మొక్కజొన్న విత్తనాలు వేసి పండించారు.

ముడి మాంసకృత్తులు

ట్రేలో పెరగడం వల్ల తెగుళ్లు, కీటకాలు లేకుండా నాణ్యమైన మొక్కలు వచ్చాయి. ఈ పైరులో 10 శాతం మాంసకృత్తులు, 59 శాతం పీచు పదార్థం, 2.9 శాతం ఖనిజ లవణాలు, 11 శాతం ఎండు పదార్థం ఉన్నాయి. దీనిని పశువులకు మేపితే పాల దిగుబడి పెరుగుతుందని తేలింది. బొబ్బర్ల మొక్కల్లో 50 శాతం ముడి మాంసకృత్తులున్నట్లు గుర్తించారు. మండు వేసవిలో సాగునీటి కొరత ఉన్నప్పుడు తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో ఎక్కువ పశుగ్రాసాన్ని ఈ విధానంలో పండించవచ్చని, తద్వారా పాడి పశువులకు దాణా కొరత లేకుండా చూడవచ్చని వర్సిటీ ఆచార్యులు చెబుతున్నారు. అలానే ఇంటింటికీ ఆకుకూరల్ని సులభంగా పండించుకోవచ్చని చెబుతున్నారు.

ఏమిటీ హైడ్రోపోనిక్స్‌...

నీటిలో పంటలు పండించే విధానాన్ని వాడుక భాషలో ‘హైడ్రోపోనిక్స్‌’ అని పిలుస్తున్నారు. పంటల సాగుకు నేల ఎక్కువగా అందుబాటులో లేని దేశాల్లో ఈ విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. హరిత పందిరిలో నియంత్రిత వాతావరణంలో గొట్టాలు, ట్రేలు ఏర్పాటుచేసి వాటిలో నీటిని నింపి మొక్కలు పెంచుతారు. సూక్ష్మపోషకాలను ద్రావణం రూపంలో అందిస్తారు. ఈ ద్రావణాల ధర లీటరు రూ.500-1000 వరకూ ఉంది.

ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చు

"ఐసీఏఆర్‌ ప్రాజెక్టు కింద మొక్కజొన్న, బొబ్బర్ల పశుగ్రాసాలను హైడ్రోపోనిక్స్‌ విధానంలో తక్కువ వ్యయంతో వర్సిటీలో సాగుచేశాం. ఇలా భారీగా సాగుచేయడం ఖరీదైన వ్యవహారమే. చిన్న స్థలంలో ఇళ్లు, హోటళ్లకు అవసరమైన నాణ్యమైన కూరగాయలు పండించవచ్చు. ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చు."

-డాక్టర్‌ శశికళ, ప్రధాన శాస్త్రవేత్త

ఎక్కువ స్థలం లేకున్నా పంటలు..

"ఇంటి ఆవరణలో, బాల్కనీలో తక్కువ స్థలం ఉన్నవారు ఈ విధానంలో నాణ్యమైన ఆకుకూరలు, క్యాబేజీ వంటివి పండించుకోవచ్చు. విద్యార్థులు ప్రాజెక్టుల్లో భాగంగా హైడ్రోపోనిక్స్‌పై పరిశోధనలు చేసి నాణ్యమైన ఆకుకూరలు పండించారు. ఒక ఇంటిలో రూ.50 వేల వ్యయంతో హైడ్రోపోనిక్స్‌ పరికరాలు ఏర్పాటుచేసుకుంటే మేలైన ఆకుకూరలు పండించుకోవచ్చు."

- డా. మనోహర్‌, ప్రధాన శాస్త్రవేత్త, జయశంకర్‌ వర్సిటీ వ్యవసాయ కళాశాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.