ETV Bharat / city

Jal Jeevan Mission Project at AP: ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ ఇంకెప్పుడో? ..జాప్యంపై కేంద్రం అసంతృప్తి

Jal Jeevan Mission Project Works in AP: రాష్ట్రంలో జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్​ పనులు మందకొడిగా సాగుతున్నాయి. పలు చోట్ల అయితే పనులే మొదలు కాలేదు. పథకం అమలు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. పనుల్లో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసిందని తెలుస్తోంది. ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ ఇంకెప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు.

Jal Jeevan Mission at AP
Jal Jeevan Mission at AP
author img

By

Published : Dec 23, 2021, 9:09 AM IST

Jal Jeevan Mission Project in AP: రాష్ట్రంలో జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు కింద పనులు ప్రారంభమై రెండేళ్లవుతున్నా ఇప్పటికీ చాలాచోట్ల పనులే మొదలు కాలేదు. పనులు ప్రారంభించిన చోట మందకొడిగా సాగుతున్నాయి. రాష్ట్రంలో పథకం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పనుల్లో జాప్యంపై జలశక్తి మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసిందని తెలుస్తోంది. గత రెండేళ్లుగా వాటా నిధులను (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేరో 50శాతం భరించాలి) కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చలేదని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అడిగిన ప్రశ్నకు జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ఈనెల 6న సమాధానమిచ్చారు. 2021-22 సంవత్సరానికి మంజూరు చేసిన గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చిలోగా ఉపయోగించకపోతే మురిగిపోతుందని కూడా ఆయన అన్నట్లు వార్తలొచ్చాయి.

రెండేళ్లలో ఇచ్చిన కనెక్షన్లు 18.47 లక్షలే

పూర్తి చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ప్రతిపాదిత పనులు పలు చోట్ల మొదలు కాని కారణంగా గత రెండేళ్లలో కొత్తగా 18,47,116 ఇళ్లకే కుళాయి కనెక్షన్లు ఇవ్వగలిగారు. ప్రణాళిక ప్రకారమైతే ఇప్పటికే 35 లక్షలకుపైగా కనెక్షన్లు ఇవ్వాలి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95,16,846 గృహాలు ఉన్నాయి. 2019 ఆగస్టు 15న జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు ప్రారంభమైన నాటికి 30,74,310 (32.30%) ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. గత రెండేళ్లలో ఇచ్చిన వాటితో కలిపి ప్రస్తుతం 49,21,426 (51.71%) ఇళ్లకు నీటి కనెక్షన్లు ఉన్నాయి. వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఒకటీ లేదు. కనెక్షన్ల జారీలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడింది. ఈ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోగల 6,65,023 గృహాల్లో 1,06,657 (16.04%) కనెక్షన్లు ఇచ్చారు. విశాఖపట్నం, గుంటూరు, విజయనగరం, ప్రకాశం, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నాయి.

పెండింగ్‌ బిల్లులు రూ.350 కోట్లు

AP Jal Jeevan Mission news: జలజీవన్‌ మిషన్‌లో ఇప్పటివరకు చేసిన పనులకు రూ.350 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)లో అప్‌లోడ్‌ చేసిన వీటికి అనుమతులు రావాలి. గ్రామాల్లో పైపులైన్లు వేసేందుకు రూ.5 లక్షల్లోపు పనులను చిన్న కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరంతా ప్రస్తుతం బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. జలాశయాలకు పైపులైన్ల అనుసంధానం, ఇతర పెద్ద పనులకు పిలుస్తున్న టెండర్లకు గుత్తేదారుల నుంచి స్పందన లేదు. ఒకే పనికి రెండు, మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రావడం లేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

  • 2019-20, 2020-21 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.453.66 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందని జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
  • 2021-22లో కేంద్రం రూ.3,182.88 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.3,182.88 కోట్లు కేటాయించాలి.
  • ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో 1,100 ఇళ్లకు జేజేఎంలో కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. రూ.1.10 కోట్ల బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. చెల్లింపుల్లో జాప్యంతో మరో రూ.80 లక్షల విలువైన పనులకు గుత్తేదారుల నుంచి స్పందన లేదు.
  • విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో రూ.8 కోట్లతో కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్న ప్రణాళిక ఆచరణకు నోచుకోలేదు. రూ.2.10 కోట్ల టెండర్లు ఖరారైనా పనులు ప్రారంభం కాలేదు. పలు గ్రామాల్లో మరో రూ.6 కోట్ల పనులకు గుత్తేదారుల నుంచి స్పందన లేదు.
.
.

ఇదీ చదవండి..

TTD TICKETS: జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు.. ఇవాళ, రేపు విడుదల చేయనున్న తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.