అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే.. తెదేపా సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేయడంపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వీలైతే.. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి.. చేతగాకపోతే బయట కూర్చోవాలి. మా సభ్యులను రెచ్చగొట్టి.. ఏదైనా అంటే వారికి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. పదిమంది ఉన్నారు.. వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. స్పీకర్ పోడియం మెట్ల వద్ద మార్షల్స్‌ను పెట్టి అక్కడే అడ్డుకోవాలి. మార్షల్స్ సాయంతో ఆందోళన చేసేవారిని బయటపడేయాలి’’ అని ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.
'మీ ఇల్లు అనుకుంటున్నారా?'
అంతకుముందు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ...సభ్యుల హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇది శాసనసభ అనుకుంటున్నారా? మీ ఇల్లు అనుకుంటున్నారా అని తెదేపా సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద తెదేపా సభ్యులను తీసుకెళ్లి వారి స్థానాల్లో కూర్చోబెట్టాలని మార్షల్స్‌ను ఆదేశించారు.
ఇదీ చదవండి: