ETV Bharat / city

'రస్​ అల్ ఖైమా' అంటే సీఎం జగన్​కు ఎందుకంత భయం?

రస్‌ అల్‌ ఖైమా వ్యవహారం కొనసాగుతుండగానే రాష్ట్రానికి ఓ మహిళ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందంటూ వైకాపా నేత పీవీపీ చేసిన ట్వీట్‌పై వివరణ ఇవ్వాలని తెలుగుదేశం నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. సీఎం జగన్ దిల్లీ పర్యటన వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు.

author img

By

Published : Feb 22, 2020, 9:30 PM IST

varla ramaiah
varla ramaiah
మీడియా సమావేశంలో వర్ల రామయ్య

రస్​ అల్ ఖైమా వ్యవహారంపై సీఎం జగన్​మోహన్​ రెడ్డి మౌనం వీడాలని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే... రాష్ట్రానికి ఓ మహిళ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందంటూ వైకాపా నేత పీవీపీ చేసిన ట్వీట్‌పై వివరణ ఇవ్వాలని తెలుగుదేశం నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. వెంటనే పీవీపీ ట్వీట్ ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలన్నారు. రస్ అల్ ఖైమా అంటే సీఎం జగన్​ ఎందుకు వణుకుతున్నారో చెప్పాలని అన్నారు. వైకాపాకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి వస్తోన్న అరోపణలను ఖండించగలదా అని సవాల్ చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌ను సీఎం కలవకపోవటానికి కారణమేంటని వర్ల రామయ్య ప్రశ్నించారు. సీఎం జగన్‌ చేసిన తప్పిదానికి ప్రధాని మోదీ ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుందని ఆరోపించారు. సీఎం జగన్‌కు చెందిన న్యాయవాదులు ఎన్నిసార్లు రస్‌-అల్‌-ఖైమాకు వెళ్లారని వర్ల రామయ్య ప్రశ్నించారు.

ఇదీ చదవండి

'సాధించేది ఏమి లేకనే జగన్ సిట్ అంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.