రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఎన్నికల కమిషనర్దేనని వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ సంప్రదించినంత మాత్రాన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కాదని కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడితే కోర్టులో ఈసారి అక్షింతలతోనే ఆగిపోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వివేకరహితంగా ఉన్నాయని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి