ఇదీ చదవండి: కొవిడ్‌పై సీఎస్‌కు చంద్రబాబు లేఖ
ప్రజాసంపదకు సంరక్షణ కరవు..! - అమరావతి వార్తలు
రాజధాని అమరావతిలో ఏడాదికాలంగా పనులు నిలిచిపోయాయి. వివిధ దశల్లో అర్ధాంతరంగా ఆగిన పనులతో సామాగ్రి పాడవుతోంది. వర్షాలతో కొన్ని నిర్మాణాలు నీటిలోనే ఉండటంతో ఇనుప సామగ్రి తుప్పుపడుతోంది. భారీ పైపులైన్లు దెబ్బితింటున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాసంపదకు రక్షణ కరవైంది.
అమరావతిలో ఆగిన నిర్మాణాలు
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం వికేంద్రీకరణ పేరిట 3 రాజధానుల ఏర్పాటు ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఈ సంగతి హైకోర్టు విచారణలో ఉంది. ఆయితే ఇప్పటికే రాజధానిలో దాదాపు నిర్మాణం పూర్తైన భవనాలు ప్రస్తుతం నిరుపయోగంగా పడున్నాయి. కొన్ని చివరిదశ నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలతో కొన్ని నిర్మాణాలు నీటిలోనే పాడైపోతుండగా... సామగ్రి తుప్పుపడుతోంది. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాసంపదకు సంరక్షణ కరవైంది. రాజధాని అమరావతిలో ప్రస్తుత పరిస్థితిని చూస్తే అవేదన కలగకమానదు.
ఇదీ చదవండి: కొవిడ్‌పై సీఎస్‌కు చంద్రబాబు లేఖ