రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారి జీ. అనంతరామును జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. చాలాకాలంగా నిరీక్షణలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్‌జైన్, గతంలో సీఆర్డీఏ కమిషనర్‌గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్‌కు పోస్టింగ్‌లు ఇచ్చింది. అజయ్‌జైన్‌ను గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. గృహ నిర్మాణ సంస్థ ఎండీగాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
అధికారి పేరు | హోదా |
అజయ్ జైన్ | గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ(ఎఫ్ఏసీ) |
కాంతిలాల్ దండే | పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి |
సిద్ధార్థ జైన్ | స్టాంప్స్, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్, ఐజీ |
భాను ప్రకాశ్ | గిడ్డంగుల కార్పొరేషన్ వీసీఎండీ |
పి.ఉషా కుమారి | ఆయుష్ కమిషనర్ |
పి.ఎ.శోభ | గిరిజన సహకార సంస్థ వీసీఎండీ |
టి.బాబూరావు నాయుడు | పునరావాస ప్రత్యేక కమిషనర్ |
కె.శారదా దేవి | మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ |
జి.రేఖా రాణి | కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్ |
చెరుకూరి శ్రీధర్ | సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శి |
ఎల్.ఎస్.బాలాజీ రావు | మార్క్‌ఫెడ్, ఆగ్రోస్ ఎండీ |
సుమిత్ కుమార్ | ఏపీ ఫైబర్ నెట్ ఎండీ |
అభిషిత్ కిశోర్ | రాజమహేంద్రవరం పురపాలక కమిషనర్ |
నందకిశోర్ | ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ ఎండీ |
వాసుదేవరెడ్డి | ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ |
మధుసూదన్‌రెడ్డి | ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ |
రామకృష్ణ | ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్, కార్యదర్శి |
చంద్రమోహన్‌రెడ్డి | పట్టణ ఆర్థిక, మౌలిక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ |
ఇవీ చదవండి..