హైదరాబాద్ ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలోని బోరబండ ఇందిరానగర్ ఫేజ్-2లో ఓ దేవాలయం గదిలో బయటపడిన అస్థిపంజరం కేసును పోలీసులు ఛేదించారు. కోల్‌కతాకు చెందిన పలాష్ పాల్(43) కార్పెంటర్. 2009లో నగరానికి వచ్చాడు. మొదటి భార్య మరణించగా రెండో వివాహం చేసుకున్నాడు. అదే రాష్ట్రం మిడ్నాపూర్‌కు చెందిన ప్లంబర్ కాంట్రాక్టర్ కమల్ మైతీ(50) తన కుటుంబంతో కలిసి రాజీవ్‌గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు.
కమల్ భార్యపై పలాష్ కన్నేశాడు. విషయం తెలిసిన కమల్.. అతడిని మందలించాడు. దీంతో కక్ష పెంచుకుని సమయం కోసం ఎదురుచూడసాగాడు. కమల్‌ను జనవరి 10న ఇందిరానగర్ ఫేజ్-2లోని గోదాంకు రప్పించిన పలాష్.. కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి పరారయ్యాడు. దేవస్థాన నిర్వాహకులు దుకాణాన్ని ఖాళీ చేయిస్తుండగా.. ఈ వ్యవహారం బయటపడిన విషయం విదితమే.
ఇదీ చదవండి: