ETV Bharat / city

రాష్ట్రంలో ఎక్కడి పేదలకైనా రాజధానిలో ఇళ్ల స్థలాలు - కొత్త సవరణలు చేసిన మంత్రి వర్గ సమావేశం

రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాజధాని బయటి ప్రాంతాలకు చెందినవారికి ఇళ్లస్థలాలు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు నిలిపివేయడంతో... ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా సీఆర్‌డీఏ చట్టాన్నే సవరించాలని నిర్ణయించింది. రాజధాని పర్స్పెక్టివ్‌ ప్లాన్‌, బృహత్తర ప్రణాళిక, మౌలిక వసతుల ప్రణాళికలో ఇష్టానుసారం మార్పులు చేసుకునేందుకు వీలుకల్పిస్తూ సీఆర్‌డీఏ చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

Housing plots in the capital for the poor anywhere in the state
రాష్ట్రంలో ఎక్కడి పేదలకైనా రాజధానిలో ఇళ్ల స్థలాలు
author img

By

Published : Sep 8, 2022, 8:02 AM IST

రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాజధాని బయటి ప్రాంతాలకు చెందినవారికి ఇళ్లస్థలాలు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు నిలిపివేయడంతో... ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా సీఆర్‌డీఏ చట్టాన్నే సవరించాలని నిర్ణయించింది. రాజధాని పర్స్పెక్టివ్‌ ప్లాన్‌, బృహత్తర ప్రణాళిక, మౌలిక వసతుల ప్రణాళికలో ఇష్టానుసారం మార్పులు చేసుకునేందుకు వీలుకల్పిస్తూ సీఆర్‌డీఏ చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 2014నాటి సీఆర్‌డీఏ చట్టంలోని 41(1), 41(3) సెక్షన్లను సవరించడంతో పాటు, కొత్తగా 41(6) సెక్షన్‌ను చేర్చింది. 2(22) సెక్షన్‌ను సవరించడంతోపాటు, కొత్తగా 53(1) సెక్షన్‌ను జతచేసింది. రాజధానిలో అందుబాటు ధరలో గృహనిర్మాణ పథకానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతంవారైనా అర్హులేనని, ఆ పథకం రాజధానిలోని 29 గ్రామాల ప్రజలకే పరిమితం కాదని ఆ సెక్షన్‌లో ప్రభుత్వం పొందుపరిచింది.

* అభివృద్ధి కార్యక్రమాల అమలు ముసుగులో సీఆర్‌డీఏ చట్టంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్స్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల చట్టంలోనూ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది. కానీ వీటిలో సీఆర్‌డీఏ చట్టంలో ప్రతిపాదించిన సవరణలే అత్యంత కీలకమైనవి. రాజధానికి రైతులిచ్చిన భూముల్లో బయటివారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు జోనల్‌ రెగ్యులేషన్‌ విధానానికి వ్యతిరేకమని హైకోర్టు ధర్మాసనం 2020 మార్చి 23న స్పష్టంచేసింది. అలాగే రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయడానికి వీల్లేదని, ఉన్నది ఉన్నట్టుగా రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలని రాజధాని కేసులపై 2022 మార్చి 3న ఇచ్చిన మరో తీర్పులో హైకోర్టు ధర్మాసనం విస్పష్టంగా పేర్కొంది. దానికి భిన్నంగా ఇప్పుడు రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలుకల్పిస్తూ ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టానికి సవరణలు తేవడం హైకోర్టు తీర్పుల్ని ఉల్లంఘించడమేని న్యాయనిపుణులు చెబుతున్నారు.

పర్సన్‌ ఇన్‌ఛార్జి ప్రతిపాదిస్తే చాలట

* రాజధాని మాస్టర్‌ప్లాన్‌, పర్స్పెక్టివ్‌ ప్లాన్‌, మౌలిక వసతుల ప్రణాళిక, అభివృద్ధి ప్రణాళికల్లో మార్పులు చేయాలని ఎన్నికైన స్థానిక సంస్థల నుంచి ప్రతిపాదన వస్తే, అది సరైనదని అనుకుంటే సీఆర్‌డీఏ అథారిటీ దాన్ని పరిశీలించవచ్చునని సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 41 (1) చెబుతోంది. దాన్ని సవరిస్తూ... ఎన్నికలు జరగని చోట ప్రత్యేకాధికారి గానీ, పర్సన్‌ ఇన్‌ఛార్జి నుంచి ప్రతిపాదన వచ్చినా సరిపోతుందని, సీఆర్‌డీఏ అథారిటీ సొంతంగా లేదా, ఎవరైనా భూ యజమాని నుంచి వచ్చిన ప్రతిపాదన ఆధారంగా కూడా ఈ ప్రణాళికల్లో మార్పులు చేయొచ్చని ప్రభుత్వం పేర్కొంది. రాజధాని పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ప్రభుత్వ అధికారులే అక్కడ పర్సన్‌ ఇన్‌ఛార్జులు. వారినుంచి ప్రతిపాదన తీసుకుని, రాజధాని ప్రణాళికల్లో మార్పులు చేసేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

* రాజధాని ప్రణాళికల్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే... వాటిని ప్రజల ముందు ఉంచి, 15రోజులు గడువిచ్చి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలని సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 41(3) చెబుతోంది. దానిలో ప్రజలతో పాటు, సంబంధిత స్థానికసంస్థల అభిప్రాయం కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పుడు సవరణ ప్రతిపాదించింది.

* భూసమీకరణ పథకం అంటే... రైతుల నుంచి స్వచ్ఛందంగా భూములు సమీకరించి, వాటిలో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు, ప్రజావసరాలకు ఖాళీస్థలాలు, పార్కులు, ఆటస్థలాలు, బలహీనవర్గాల వారికి సామాజిక గృహ నిర్మాణం, పాఠశాలల వంటి వసతులు కల్పించేసేందుకు, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం కొంత భూములు మినహాయించి, మిగతా భూముల్లో స్థలాలు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వడమని సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 2(22) నిర్వచించింది. దానిలో బలహీనవర్గాలకు గృహనిర్మాణం అన్నచోట... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పథకాల కింద ఇళ్ల నిర్మాణానికి స్థలాల కేటాయింపు అని చేరుస్తూ ప్రభుత్వం ఇప్పుడు సవరణ ప్రతిపాదించింది.

* సీఆర్‌డీఏ చట్టంలో గతంలో లేని సెక్షన్‌ 53(1)ని ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించింది. రాజధానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఇళ్ల నిర్మాణానికి స్థలాలు పొందేందుకు రాష్ట్రంలోని పౌరులందరూ అర్హులేనని, 29 గ్రామాలకే పరిమితం చేయరాదని పేర్కొంది.

అప్పుడు కుదరలేదని ఇప్పుడిలా!

అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూమిలో 1,251 ఎకరాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల, మండలాలతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 54,307 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు రాజధానిలో ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 25న జీవో నం.107 జారీ చేసింది. దాన్ని రాజధాని రైతులు హైకోర్టులో సవాలు చేశారు. దానిపై హైకోర్టు ధర్మాసనం తీర్పు చెబుతూ... రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడం సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. రాజధాని పరిధిలో స్థలాల కేటాయింపులో రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి పాత్రా ఉండదని తేల్చిచెప్పింది. ప్రభుత్వం జారీచేసిన జీవో నం.107ని సస్పెండ్‌ చేసింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం చట్టాన్నే సవరించాలని నిర్ణయించింది.

రాజధానిని నాశనం చేసేందుకే

‘రాజధాని అమరావతిని నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానిలో భాగమే ఇవన్నీ. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని పర్స్పెక్టివ్‌ ప్లాన్‌ని పదేళ్ల వరకూ, మాస్టర్‌ప్లాన్‌ని 30 ఏళ్ల వరకూ మార్చడానికి వీల్లేదు. తర్వాత కూడా గ్రామసభల ఆమోదంతోనే మార్పుచేర్పులు చేయాలి. రాజధానిలో అశాంతిని రేకెత్తించేందుకు, ఘర్షణలు తలెత్తేలా చేసేందుకు, మాస్టర్‌ప్లాన్‌ని ఉల్లంఘించి బయటివారికి అక్కడ భారీ ఎత్తున స్థలాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది మాస్టర్‌ప్లాన్‌కి విరుద్ధమని కొందరు కోర్టుకు వెళ్తే.. బయటి ప్రాంతాల పేదలకు రాజధానిలో చోటు లేదన్నారని దుష్ప్రచారం చేసింది. ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించకుండా, 107 జీవోను కొట్టేసింది. ప్రభుత్వం తన వ్యూహం అమలుకు హైకోర్టు తీర్పు అడ్డు వస్తుండటంతో, ఇప్పుడు ఈ దొడ్డిదారి ఎంచుకుంది. అది కోర్టు తీర్పును ఉల్లంఘించడమే.’

- ఉన్నం మురళీధరరావు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.