ETV Bharat / city

Registrations: రియల్టీ రంగంలో రివర్స్ ట్రెండ్..! హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు - ఏపీలో భూముల రిజిస్ట్రేషన్‌ వివరాలు

Hyderabad House Registrations down: హైదరాబాద్‌ మెట్రో నగరంలో గృహా విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. సెప్టెంబరులో 4,307 గృహాలు రిజిస్ట్రేషన్‌ కాగా గడిచిన తొమ్మిది నెలల్లో రికార్డు స్థాయిలో యాభైవేలకు పైగా గృహ యూనిట్లు రిజిస్ట్రేషన్‌ జరిగాయి. సెప్టెంబరులో జరిగిన విక్రయాల్లో యాభై లక్షల లోపు విలువైన యూనిట్లు 55శాతం, వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 71శాతం అమ్ముడు పోగా మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే 84శాతం గృహాలు క్రయవిక్రయాలు జరిగాయని నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు
Hyderabad House Registrations down
author img

By

Published : Oct 14, 2022, 11:44 AM IST

Hyderabad House Registrations down: తెలంగాణాలోని హైదరాబాద్‌ నగరంలో రోజు రోజుకు గృహాల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొవిడ్‌ తరువాత స్థిరాస్తి వ్యాపారం బాగా పుంజుకుందని.. అంచనా వేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు తాజాగా నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన తొమ్మిది నెలల్లో గత ఏడాది రూ.27,640 కోట్లు విలువైన 62,052 గృహ యూనిట్లు అమ్ముడు పోగా ఈ ఏడాది అదే సమయంలో రూ.25,094 కోట్లు విలువైన 50,953 గృహ యూనిట్లు మాత్రమే విక్రయాలు జరిగాయి.

అంటే గత ఏడాదితో పోలిస్తే ఏకంగా రూ.2,546 కోట్లు విలువైన 11,099 యూనిట్లు తగ్గాయి. ప్రధానంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డిల పరిధిలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇందులో ఎక్కువ 84శాతం ఇల్లు రంగరెడ్డి, మేడ్చల్‌ మల్కాగిరి జిల్లాల్లోనేనని రిజిస్ట్రేషన్‌లు జరగడంతో పాటు అధిక ఆదాయం కూడా ఆ జిల్లాల నుంచి వస్తోంది.

గడిచిన తొమ్మిది నెలలను తీసుకుంటే.. ఒక్క మే నెలలో మాత్రమే ఇళ్ల అమ్మకాల్లో 152శాతం, రాబడిలో 146శాతం వృద్ధి నమోదు చేశాయి. మిగిలిన ఎనిమిది నెలల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తక్కువనే విక్రయాలు జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబరు నెలలో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 28శాతం తక్కువ గృహాలు అమ్మకాలు జరిగాయి. గత నెలలో 4,307 గృహ యూనిట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా, అంతకు ముందు ఏడాది సెప్టెంబరులో 6,017 గృహ యూనిట్లు అమ్ముడు పోయాయి.

25లక్షల లోపు విలువైన ఇళ్లు 36శాతం నుంచి 16శాతానికి పడిపోగా, 25 నుంచి యాభై లక్షల మధ్య విలువైన ఇళ్లు 39శాతం నుంచి 55 శాతానికి ఎగబాకినట్లు గణాంకలు వెల్లడిస్తున్నాయి. వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగులు గృహాలకు అధికంగా డిమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా 71శాతం గృహాలను మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా తీసుకుంటే సంగారెడ్డిలో దాదాపుగా కొనుగోళ్లు నిలచిపోయాయి. కేవలం ఒక్కశాతం మాత్రమే అక్కడ విక్రయాలు జరిగాయి. హైదరాబాద్‌లో 13శాతం నుంచి 15శాతానికి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 42శాతం నుంచి 43శాతం, రంగారెడ్డి జిల్లాల్లో 37శాతం నుంచి 41శాతానికి గృహాలు అమ్మకాలు జరిగినట్లు నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.